Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Tiger Attack | ఇంగ్లండ్ (England) లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉత్తర ఇంగ్లండ్‌లోని డాన్‌కాస్టర్ సమీపంలో ఉన్న ప్రఖ్యాత యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్ (Wildlife Park) లో ఒక వ్యక్తి పులి ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. వెంటనే పులి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు.
Tiger Attack : ఇంగ్లండ్ (England) లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉత్తర ఇంగ్లండ్‌లోని డాన్‌కాస్టర్ సమీపంలో ఉన్న ప్రఖ్యాత యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్ (Wildlife Park) లో ఒక వ్యక్తి పులి ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించాడు. వెంటనే పులి దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని సౌత్ యార్క్‌షైర్ పోలీసులు వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 1.35 గంటల ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం మధ్యాహ్నం 1:35 గంటల సమయంలో ఒక వ్యక్తి వైల్డ్‌లైఫ్ పార్కులో టైగర్ ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ టీమ్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే పులి దాడి చేయడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వైద్య సిబ్బంది అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం అందించామని, వారికి ప్రత్యేక అధికారుల ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలిపారు. పులికి ఎలాంటి గాయాలు కాలేదని, అది సురక్షితంగా ఎన్‌క్లోజర్‌లోనే ఉందని పోలీసులు స్పష్టంచేశారు. పులి దాడికి సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో సర్క్యులేట్ అవుతున్నాయని, దయచేసి వాటిని ఎవరూ పంచుకోవద్దని ప్రజలను కోరారు.
A man has jumped into a tiger enclosure at The Yorkshire Wildlife park!
No reports yet, as to whether he survived or not, apart from gun shots were fired & the park has been closed with heavy police & ambulance presence 🤦🏾♀️
I don’t even want to ask, how or why?
#YWLP https://t.co/H7il8rc9eN— SK 💃🏾🕺 (@Rimmesfk) October 10, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

