ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్ల టికెట్ ధరల పెంపునకు సంబంధించిన జీవోను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అక్కడి థియేటర్లలో టికెట్ రేట్లు పెంచాలని కోరుతూ ఇటీవల చిత్రపరిశ్రమ నుంచి ప్రముఖులు ముఖ్యమంత్రి జగన్ను కలిసి చర్చలు జరిపారు. వీలైనంత త్వరలో సవరించిన రేట్లను అధికారికంగా ప్రకటిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు తాజాగా జీవోను విడుదల చేసింది. ఈ కొత్త ఆదేశాల్లో మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, నగర, గ్రామ పంచాయితీల్లో నాన్ ఏసీ, ఏసీ, మల్టీప్లెక్స్ ప్రకారం టికెట్ రేట్లను కనిష్టంగా 20 రూపాయలు, గరిష్టంగా 250 రూపాయల వరకు అనుమతించారు. దీంతో ఇకపై విడుదల కానున్న సినిమాలకు సవరించిన రేట్లు అమల్లోకి రానున్నాయి.