T Hub | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ): స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి టీ హబ్ ప్రత్యేకంగా ల్యాబ్ 32 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు 12 సార్లు నిర్వహించిన కార్యక్రమంలో 300లకు పైగా స్టార్టప్‌లకు పూర్తిస్థాయిలో సహకారం అందించామని, తాజాగా 13వ సారి ల్యాబ్ 32 కార్యక్రమానికి శ్రీకారంచుట్టామని టీ హబ్ సీఈవో ఎంఎస్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆగస్టు 10 లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత ఎంపికైన స్టార్టప్‌లకు ఆగస్టు 27 నుంచి నవంబర్ 27 వరకు అన్ని రకాలుగా సేవలు అందించనున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీలైన ఏఐ, మెషిన్ లర్నింగ్, బ్లాక్చెయిన్లతో మెటావర్స్, వెబ్ 3.0, ఫిన్‌టెక్, అగ్రిటెక్, హెల్త్‌టెక్ రంగాలకు సంబంధించిన స్టార్టప్‌లను ఎంపిక చేశామని, తాజా విడతలో కేవలం సాస్ (సాప్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్) స్టార్టప్‌లను ప్రోత్సహించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.