హైదరాబాద్, ఆట ప్రతినిధి: దుబాయ్ వేదికగా జరిగిన యూత్ ఏషియన్ పారా గేమ్స్‌లో తెలంగాణ యువ అథ్లెట్లు బానోతు అకీరానందన్ సత్తాచాటాడు. ఆదివారం జరిగిన పురుషుల 200మీటర్ల టీ38 కేటగిరీలో అకీరానందన్ 23.50 సెకన్ల టైమింగ్‌తో పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. మహిళల పారా టేబుల్ టెన్నిస్ డబుల్ మిక్స్డ్ విభాగంలో విజయ దీపిక స్వర్ణంతో మెరువగా, అదే దూకుడు కొనసాగిస్తూ సింగిల్స్‌లో కాంస్యం ఖాతాలో వేసుకుంది.
పురుషుల స్విమ్మింగ్ ఎస్8 విభాగంలో శ్రీనికేశ్ కిరణ్ 100మీటర్ల ఫ్రీస్టయిల్, 100మీటర్ల బెస్ట్స్ట్రోక్, 50మీటర్ల ఫ్రీస్టయిల్లో మూడు కాంస్య పతకాలు దక్కించుకున్నాడు. మహిళల 200మీటర్ల విభాగంలో రాష్ర్టానికి చెందిన శిరీష 31.04సె టైమింగ్‌తో ఆరో స్థానంలో నిలిచి నిరాశపరిచింది.