కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం
ఎన్కౌంటర్| జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా దళాల ఎన్కౌంటర్లో ముగ్గురు లష్కరే తొయిబా టెర్రరిస్టులు హతమయ్యారు. సోపోర్ సమీపంలోని గుండ్‌బ్రాత్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా దళాల ఎన్కౌంటర్లో ముగ్గురు లష్కరే తొయిబా టెర్రరిస్టులు హతమయ్యారు. సోపోర్ సమీపంలోని గుండ్‌బ్రాత్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భదత్రతా బలగాలు, పోలీసులు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారంతా లష్కరే తొయిబాకు చెందిన టెర్రరిస్టులని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. వారిలో ఒకరు లష్కరే ఉగ్రవాదుల్లో ముఖ్యుడైన ముదసిర్ పండిత్ ఉన్నారని చెప్పారు. అతడు ముగురు పోలీసులు, ఇద్దరు కౌన్సిలర్లు, ఇద్దరు పౌరుల హత్యకేసుల్లో పాలుపంచుకున్నాడని వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లో అతనితోపాటు మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టామని తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

