అలా నమితను కాస్తా మమితనయ్యా
‘ప్రేమలు’ సినిమా మమితాబైజు తలరాతను మార్చింది. ఆ సినిమాలోని ఆమె నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి.
‘ప్రేమలు’ సినిమా మమితాబైజు తలరాతను మార్చింది. ఆ సినిమాలోని ఆమె నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆ ఒక్కసినిమాతోనే దక్షిణభారతం మొత్తం మమితకు ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన డ్యూడ్, జననాయగన్, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలు ఆమెను ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. ప్రస్తుతం తమిళంలో ‘ఇరందు వానమ్’, మలయాళంలో ‘హలో డియర్’ సినిమాలు చేస్తూ మమిత బిజీగా ఉన్నది. ఇదిలావుంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పేరుకు సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టింది మమితా బైజు.
నిజానికి ఆమె పుట్టగానే తల్లిదండ్రులు పెట్టిన పేరు నమిత. అయితే.. బర్త్ సర్టిఫికెట్ నమోదు చేసే క్రమంలో అధికారుల పొరపాటు కారణంగా ‘నమిత’ అనే పేరు కాస్తా.. ‘మమిత’గా మారిపోయిందట. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ ‘ఈ విషయం అమ్మానాన్నలకు కూడా వెంటనే తెలియలేదు. నాలుగేళ్ల వయసులో నన్ను స్కూల్లో చేర్పించడానికి నా బర్త్ సర్టిఫికెట్‌ని పరిశీలించగా ఈ తప్పు బయటపడింది. అప్పటికే అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్నింటిలో మమితా అనే పేరే నమోదైపోవడంతో దాన్ని మార్చడం సాధ్యం కాలేదు. అలా నమితను కాస్తా మమితను అయ్యాను’ అంటూ చెప్పుకొచ్చింది మమితాబైజు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

