నీళ్లెత్తకుంటే సర్కార్‌పై పోరుబాటే
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లెత్తిపోయకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులను కూడగట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాట పడుతామని మాజీ మంత్రి, బాలొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు.
- కేసీఆర్‌పై కక్షతో కాళేశ్వరాన్ని పడావుపెట్టిండు
- బాంబులు పెట్టి బరాజ్‌ను పేల్చాలని కుట్ర
- రేవంత్ చేతగానితనం వల్లే రాష్ట్రంలో కరువు
- రోజుకు రెండు టీఎంసీలు వృథాగా పోతుంటే
- ఎత్తిపోయకుండా తమ్మిడిహట్టి అని రాగమేంది?
- మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ధ్వజం
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో
- కలిసి మేడిగడ్డ వద్ద గోదావరి జలాల పరిశీలన
- బరాజ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
- మెయిన్ గేట్ వద్ద బీఆర్ఎస్ బృందం నిరసన
జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లెత్తిపోయకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులను కూడగట్టి కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాట పడుతామని మాజీ మంత్రి, బాలొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బరాజ్‌ను ఎమ్మెల్యేలు గణేశ్‌గుప్తా, గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, సురేందర్, పుట్ట మధుకర్, నిజామాబాద్ జడ్పీ మాజీ చైర్మన్ విఠల్‌రావుతో కలిసి మంగళవారం ఆయన సందర్శించారు. గోదావరిలోకి దిగి సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని చూసి ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం నీటి ప్రవాహంలోనే ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
గోదావరి నీళ్లన్నీ సముద్రంలోకి వృథాగా పోతుంటే రేవంత్ పాలనలో రాష్ట్ర సంపదంతా రాహుల్ పాలవుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే గోసపడ్తామని కేసీఆర్ చెప్పిన మాట ఇవాళ నిజమవుతున్నదని, మేడిగడ్డ బరాజ్ నుంచి రోజుకు 22వేల క్యూసెకుల నీళ్లు సముద్రంలో కలుస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద వృథాగా పోతున్న నీటిని ఎత్తిపోయమంటే, రేవంత్‌రెడ్డి మాత్రం సిగ్గులేకుండా తమ్మిడిహట్టి వద్ద బరాజ్ కడుతామని కొత్త రాగం ఎత్తుకున్నారని నిప్పలుచెరిగారు. మేడిగడ్డ వద్ద రోజుకు 22వేల క్యూసెకుల ప్రవాహం ఉండగా, తమ్మిడిహట్టి వద్ద 4వేల క్యూసెకులే ఉన్నదన్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. కాళేశ్వరం నుంచి వృథాగా పోతున్న జలాలను వెంటనే ఎత్తిపోసి ఎస్సారెస్పీ, నిజాంసాగర్, మిడ్‌మానేరు, రంగనాయకసాగర్, కొండపోచమ్మసాగర్‌ను నింపాలని డిమాండ్ చేశారు.
బరాజ్‌ను పేల్చేందుకు రేవంత్ కుట్ర!
కాళేశ్వరం నీళ్లిస్తే కేసీఆర్‌కు పేరొస్తుందనే కక్షతోనే రేవంత్‌రెడ్డి బరాజ్‌ను బాంబులతో పేల్చి ధ్వంసం చేయాలని కుట్రలు చేశారని ప్రశాంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డ వద్ద గేట్లు మూయకుండానే రోజుకు రెండు టీఎంసీల నీళ్లు ఎత్తిపోయవచ్చని నిపుణులు చెప్పినా ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేవలం తన గురువు చంద్రబాబు కోసం గోదావరి జలాలను ఆంధ్రాకు వదిలేస్తున్నారని విమర్శించారు.
బరాజ్‌లోని 86 గేట్లు మూడు వర్షాకాలాల్లో ప్రతిరోజూ లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని నిటారుగా నిలబడ్డాయని, రేవంత్‌రెడ్డి మాత్రం మూడేండ్ల నుంచి కాళేశ్వరం కూలిందని, బరాజ్ కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. బరాజ్ ఇలాగే ఉంటే కేసీఆర్‌కు పేరొస్తుందనే బాంబులు పెట్టి పేల్చితే రెండు పిల్లర్లు చిన్నగా క్రాక్ వచ్చాయని ఆరోపించారు. వాటిని రిపేర్ చేయడం చేతగాక, తమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడుతాననడం విడ్డూరంగా ఉన్నదని దుయ్యబట్టారు. కావాలనే కాళేశ్వరాన్ని పడావు పెట్టి రైతుల నోట్లో మట్టికొట్టారని దుమ్మెత్తిపోశారు. రేవంత్‌రెడ్డి బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా రైతులకు నీళ్లు ఎత్తిపోయాలని, లేకపోత పురుగులపడి పోతాడంటూ హెచ్చరించారు. లేకపోతే రైతులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు.
నీళ్లియ్యకుంటే దిగిపో రేవంత్.. : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయకపోతే రేవంత్‌రెడ్డి ముకునేలకు రాసి సీఎం పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవాలి. మేడిగడ్డ నుంచి ఇప్పటికే వందల టీఎంసీల నీళ్లను సముద్రంలోకి వదిలేసిండు. ఇప్పుడు ఎస్సారెస్పీలో కూడా నీళ్లు లేవు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాగునీరు కూడా కరువచ్చింది. ఎస్సారెస్పీలోకి నీళ్లు వస్తే ఆర్మూర్ నియోజకవర్గంలో తాగు, సాగునీరందించే 18 లిప్టులు ద్వారా 40వేల ఎకరాల పంట పండుతుంది. 10 ఏండ్ల కేసీఆర్ పాలనలో ఈ లిఫ్టుల నుంచి సరిపడా నీళ్లు వచ్చి పుష్కలమైన పంటలతో స్వర్ణయుగమైంది. మూడేండ్ల్ల నుంచి రేవంత్ పాలనలో ఒక రాతియుగంలా మారిపోయింది. కరెంటు లేదు, నీళ్లు ఇవ్వమని కుంటిసాకులు చెబుతూ కరువు రాష్ట్రంగా మార్చిండు. మేడిగడ్డ నుంచి వృథాగా పోతున్న నీటిని చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి. రేవంత్‌రెడ్డీ కబడ్దార్.. నీళ్లు ఎత్తిపోసేదాకా నీ ప్రభుత్వాన్ని వెంటాడుతాం.
ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా
ఇది ప్రకృతి ఇచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. రాష్ట్రంలో రైతులు సాగునీరందక పంటలు ఎండిపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంటే, సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం కేసీఆర్‌పై కక్షగట్టి వందలాది టీఎంసీల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నడు. ఇప్పటికైనా వృథాగా పోతున్న నీటిని ఎత్తిపోస్తే తాగు, సాగునీటికి కరువు ఉండదు. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా రాజకీయాలు మాని రైతులు, ప్రజల నీటి కష్టాలను తీర్చాలి.
బరాజ్ వైపు వెళ్లకుండా పోలీసుల అడ్డగింత
మేడిగడ్డ పరిశీలనకు నిజామాబాద్ నుంచి మంగళవారం ఉదయం బయల్దేరిన బీఆర్ఎస్ బృందాన్ని బరాజ్ మెయిన్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి నిరాకరించడంపై వారు పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేయగా, స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో బీఆర్ఎస్ నేతలు గేటుపై నుంచి బరాజ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట జరిగి కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మండిపడ్డారు. మేడిగడ్డ పిల్లర్లు కూలిపోయాయని ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తున్నందున తమ వాహనాలను బరాజ్పైకి అనుమతించాలని డిమాండ్ చేశారు. పిల్లర్లు కూలకముందే కూలినట్టు దుష్ప్రచారం చేస్తున్న ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా మారడం సిగ్గుచేటని హెచ్చరించారు. పోలీసుల తీరుకు నిరసనగా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం చిన్న గేటు నుంచి బరాజ్ పైకి వెళ్లి నీటి ప్రవాహన్ని పరిశీలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

