గాయపడ్డ వ్యక్తి జీవిత కథ
అగ్ర కథానాయకుడు దేవరకొండ విజయ్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్దన’.
అగ్ర కథానాయకుడు దేవరకొండ విజయ్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘రౌడీ జనార్దన’. గోదావరి తీరంలోని కళింగపట్టణం గ్రామ నేపథ్యంలో సాగే ఈ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌కి రవికిరణ్ కోలా దర్శకుడు. దిల్‌రాజు నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈచిత్రం డిసెంబర్లో విడుదల కానున్నది. రెండు భాగాలుగా సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్లు ఉన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవలే మంగళూరులో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను పూర్తిచేశారు.
ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈసినిమా కోసం ఓ భారీసెట్‌ని నిర్మిస్తున్నారు. ఈ సెట్లో ద్వితీయార్ధంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ని షూట్ చేస్తారట. ఇది ఓ గాయపడ్డ వ్యక్తి జీవిత చరిత్ర అని, ధైర్యసాహసాలతో, తెగింపుతో ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న జనార్దన అనే రౌడీ కథను ఈ సినిమాలో చూపించనున్నారని, అధికార పోరాటాల చుట్టూ నడిచే కథ ఇదని మేకర్స్ తెలిపారు. సీనియర్ హీరో రాజశేఖర్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పాత్ర, లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఉంటుందట. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ రూటెడ్ యాక్షన్ డ్రామాలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

