వికారాబాద్ : ఊరి అల్లుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బంధువులతో కలిసి బయలుదేరిన వారి ప్రయాణం విషాదాంతమైంది. వికారాబాద్ జిల్లా శంకర్పల్లి మండలం కేసారం నుంచి ధారూర్ మండలం చింతకుంటకు వెళ్తున్న ప్రైవేట్ బస్సు అనంతగిరి ఘాట్ రోడ్డులో బోల్తా పడింది. బస్సులో దాదాపు 50 మంది ఉండగా.. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సుమారు 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంత్యక్రియల కోసం బయలుదేరిన కుటుంబాల్లో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Ananthagiri Bus Accident6

Ananthagiri Bus Accident5

Ananthagiri Bus Accident4

Ananthagiri Bus Accident3