ఏసీబీ వలలో అవినీతి చేపలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉపాధి కల్పనశాఖ కార్యాలయంలో ఇద్దరు అధి కారులతో పాటు రిమ్స్ జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుపడ్డారు.
- రూ.2.25 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
- దొరికిన వారిలో జిల్లా ఉపాధి కల్పన అధికారి, జీఈవో, రిమ్స్ జూనియర్ అసిస్టెంట్
ఆదిలాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉపాధి కల్పనశాఖ కార్యాలయంలో ఇద్దరు అధి కారులతో పాటు రిమ్స్ జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుపడ్డారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివ రాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో పేషెం ట్ కేర్ యూనిట్‌కు సంబంధించిన విభాగంలో 24 మంది సిబ్బంది నియామకాలను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టారు. ఈ కాంట్రాక్ట్ దుర్గం ఎస్సీ లేబర్ సొసైటీకి దక్కింది. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి జారీ చేయాల్సి ఉంటుంది. పత్రం జారీ కోసం ఎంప్లాయిమెంట్ అధికారి కిరణ్‌కుమార్ రూ.3 లక్షలు డిమాండ్ చేశారు. దుర్గం ఎస్సీ లేబర్ సొసైటీ నిర్వాహకుడు దుర్గం శేఖర్ రూ.2.25 లక్షలతో అధికారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం జిల్లా ఉపాధి శాఖ కార్యాలయంలో రూ.2.25 లక్షలు లంచం తీసుకుంటుండగా జిల్లా ఎంప్లాయి మెంట్ అధికారి కిరణ్‌కుమార్, జూనియర్ ఎం ప్లాయిమెంట్ అధికారి విజయ లక్ష్మి, రిమ్స్ జూని యర్ అసిస్టెంట్ తేజను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం నిందితులను కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు సునీల్ కుమార్, జాన్‌రెడ్డి, రవీందర్, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

