హైదరాబాద్ : రాబోయే మూడు రోజులు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవుతుందని పేర్కొంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుందని చెప్పింది. పశ్చిమ గాలుల ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వివరించింది. ఇదిలా ఉండగా.. ఇవాళ 8.30 గంటల వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, మెదక్, కామారెడ్డితో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసింది.