హైదరాబాద్ : రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి బలహీనపడిందని పేర్కొంది. పశ్చిమ బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతోంది. దక్షిణ ఒడిశా తీరంలో 3.1-7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొసాగుతుందని పేర్కొంది. వీటి ప్రభావంతో ఆది, సోమ, మంగళవారాల్లో తేలిక పాటి నుంచి మోసర్తు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆదివారం పలు జిల్లాల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని వివరించింది.