న్యూయార్క్: అమెరికాలోని మిన్నెసొటాలో నివసిస్తున్న రాబ్ వారెన్-క్రిస్టిన్ దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. మూడేండ్ల ఎడం చొప్పున పుట్టిన ఈ ముగ్గురు చిన్నారుల పుట్టిన రోజు ఆగస్టు 25నే. ఒక్కో బిడ్డ మధ్య మూడేండ్ల ఎడం ఉండాలని తాము ప్లాన్ చేసుకున్నామని, అయితే, ముగ్గురూ ఒకే తేదీన పుట్టడం ఆశ్చర్యకరమని క్రిస్టిన్ తెలిపారు. ప్రతి పది లక్షల మందిలో 8 మంది దంపతులకు ఇలా ఒకే తేదీన పుట్టిన ముగ్గురు పిల్లలు ఉన్నారని క్రిస్టిన్ భర్త, యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసొటాలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న రాబ్ వారెన్ పేర్కొన్నారు. అన్నట్టు రాబ్ ఇంట్లో 16 ఏండ్ల వయసున్న ఓ పెంపుడు కుక్క ఉంది. అది కూడా ఆగస్టు 25 తేదీనే పుట్టింది.