తెలుగు సినీ పరిశ్రమలో ఎటువంటి నేపథ్యం లేకుండా దూసుకొచ్చిన యువ క్రేజీ కథానాయకుల్లో విశ్వక్సేన్ ఒకరు. ఫలక్నామా దాస్, ఈ నగరానికి ఏమైంది, హిట్ చిత్రాలతో కుర్రకారులో మంచి ఇమేజ్ను పెంచుకున్నాడు ఈ అగ్రెసివ్ హీరో. తన ప్రతి చిత్రం ప్రమోషన్స్ టైమ్‌లో ఏదో ఒక మ్యాజిక్ చేసి సినిమాకు మంచి బజ్‌ను తెచ్చిపెట్టుకోవడం ఈ హీరోలో వున్న మరో ప్రత్యేకత.
ఇటీవల సరైన కమర్షియల్ హిట్ లేక సతమతమవుతున్నాడు విశ్వక్. అయినా కూడా విశ్వక్సేన్ మార్కెట్‌కు వచ్చిన ఢోకా ఏమీ లేదు. ఆల్మోస్ట్ తన పారితోషికాన్ని డబుల్ చేసి మరి నిర్మాతల దగ్గర వసూలు చేస్తున్నాడు. అంతేకాదు ఇప్పడున్న పాపులారిటీని, క్రేజ్‌ను క్యాష్ చేసుకునే పనిలో వున్నాడు విశ్వక్, ప్రస్తుతం ఈ యువ హీరో మెకానిక్ రాకీ అనే చిత్రంతో పాటు లైలా అనే సినిమాను చేస్తున్నాడు.
ఈ చిత్రాలతో పాటు మరో మూడు సినిమాలు వరుసగా అంగీకరించాడు. అంతేకాదు ఈ సినిమాలన్నీ వచ్చే సంవత్సర పూర్తయ్యే లోపు పూర్తిచేసి విడుదల చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇదంతా విశ్వక్ తన బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునే ప్రణాళిక అని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సక్సెస్, పాపులారిటీ వున్నప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనేది విశ్వక్ ప్లాన్. ఎందుకంటే వన్స్ చరిష్మా, సక్సెస్ లేకపోతే సినీ పరిశ్రమలో పట్టించుకునే నాథుడే వుండడు. సో… ఏది ఏమైనా విశ్వక్‌ది తెలివైన నిర్ణయమే అంటున్నారు సినీ వర్గాలు.