హన్వాడ, మార్చి 16 : మండలంలోని మాదారం, యా రోనిపల్లి గ్రామాల మధ్యలో ఉన్న కొండల్లో వెలసిన తిరుమలనాథస్వామి కోరిన కోర్కెలు తీరుస్తూ భక్తులకు దర్శనమిస్తున్నాడు. దాదాపు 500 ఏండ్ల కిందట స్వయంభూగా వెలిసినట్లు చర్రిత ద్వారా తెలుస్తున్నది. ప్రతి ఏడాది హోలి పం డుగ ముందు రోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కోస్గి, కోయిలకొండ, నవాబ్‌పేట, మద్దూరు మండలాలతోపాటు ఇతర రాష్ర్టాల భక్తులు కూడా స్వామి వారిని దర్శించుకుంటారు. నాలుగు రోజులపాటు జరిగే ఉత్సవాలకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. కొండపై ఉన్న గుండంలో ఎల్లప్పుడూ నీళ్లు ఉంటాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహకారంతో రూ.8 లక్షలు వెచ్చించి తాగునీటి బోరు వే యించారు. ఆలయం వరకు పైపులైన్ ఏర్పాటు చేసి తాగునీ రు అందిస్తున్నారు. స్వామివారి కల్యాణం కోసం మండపం కూడా నిర్మించారు. రూ.10 లక్షలతో మాదారం వరకు సీసీరోడ్డు వేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా యారోనిపల్లి గ్రామం నుంచి ఆలయం వరకు రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 17న పల్లకీసేవ, ఎ దుర్కోళ్లు, 18న స్వామివారి తిరుకల్యాణం, రాత్రికి రథోత్స వం, 19న గరుఢవాహన సేవ, సహస్రనామార్చన, 20న తీ ర్థోత్సవం వంటి కార్యక్రమాలు ఉంటాయి. 20న సాయం త్రం స్వామివారిని గ్రామానికి తీసుకెళ్తారు. కాగా, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలనాథస్వామి ఆలయం వరకు వేపూర్, కోత్లాబాద్ బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే తిర్మల్‌దేవుని గుట్ట నుంచి కూడా ఆటోలు ఉంటాయి.