డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ వ్యాన్ లోయలో పడిపోవడంతో 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ దుర్ఘటన ఆదివారం ఛక్రతా పట్టణంలో చోటుచేసుకుంది. 15 మంది ప్రయాణికులతో త్యూని నుంచి వికాస్‌నగర్ వెళుతుండగా బయాలా గ్రామ సమీపంలో వ్యాన్ అదుపు తప్పింది. 13 మంది మృతదేహాలను వెలికితీశారు. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.