Chilli Powder | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని అశోక్ నగర్ జిల్లాలో దొంగలు (Thieves) రెచ్చిపోయారు. దారి కాచి ఓ రైతు (Farmer) కండ్లలో కారం కొట్టి (Chilli Powder) అతని నుంచి రూ.లక్షలు దోచుకున్నారు. ఈ ఘటన తమోయియా చక్ గ్రామంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
గ్రామానికి చెందిన 47 ఏండ్ల రైతు లఖ్విందర్.. అశోక్‌నగర్‌లోని బంధువుకు ఇవ్వడానికి రూ.25 లక్షలు తీసుకొని బైక్‌పై ఇంటి నుంచి బయల్దేరాడు. మార్గం మధ్యలో ముగ్గురు దొంగలు రైతును అడ్డగించారు. రైతుతో మాటలు కలిపారు. కాసేపటికి తమ వెంట తెచ్చుకున్న కారం లిఖ్విందర్ కండ్లలో కొట్టి అతని వద్ద ఉన్న రూ.25 లక్షల నగదు బ్యాగును తీసుకొని అక్కడి నుంచి ఉడాయించారు. తమోయియా చక్-మోహ్రి గ్రామాల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది.
కాస్త తేరుకున్న రైతు.. పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అతడి వాంగ్మూలం రికార్డు చేశారు. అనంతరం ఘటనపై దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ వివేక్ శర్మ తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read..
New Year 2026 | భారత్ కంటే ముందుగా న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకునే దేశాలేవో తెలుసా..?
Woman | దారుణం.. కదులుతున్న కారులో మహిళపై గంటలపాటూ గ్యాంగ్‌రేప్.. అనంతరం రోడ్డుపై పడేసి
Bus Catches Fire | టూరిస్ట్‌లతో వెళ్తున్న బస్సులో మంటలు.. పూర్తిగా దగ్ధం