మహబూబ్ నగర్ : సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ లో మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ మొక్కలు నాటి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా జరుపుకున్నారని తెలిపారు.
ఇది చూసి ఓర్వలేక రెండు జాతీయ పార్టీల నేతలు సభ్య సమాజం తల దించుకునేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాందీ గురించి అస్సాం సీఎం మాట్లాడితే.. సీఎం కేసీఆర్ స్పందించే దాకా కాంగ్రెస్ నేతలు కనీసం స్పందించ లేదని విమర్శించారు.
స్పందించిన సీఎం కేసీఆర్ పై నీచంగా ప్రవర్తించడం దారుణమన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పడం.. గాడిద పై ఉరెగిస్తం అనడం అనైతికమన్నారు. దేశ ప్రజలు సీఎం కేసీఆర్ ను జాతీయ నాయకత్వం వహించాలని కోరుతున్నారు. ఇది గిట్టక మీరు ఇంతలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ ను విమర్శించే తీరు మార్చుకోకుంటే.. ప్రజలు గుణపాఠం చెప్పటం ఖాయమన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా జాతీయ పార్టీల అధ్యక్షుల ప్రవర్తన ఉందన్నారు.