తిరుమల : తిరుమల (Tirumla) వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఫిబ్రవరి నెలలో ( Feburary Month ) జరిగే విశేష కార్యక్రమాల వివరాలను టీటీడీ ( TTD ) వెల్లడించింది. ఫిబ్రవరి 2న వసంత పంచమి , ( Vasantha Panchami ) 4వ తేదీన రథసప్తమి, 5న భీష్మాష్టమి, 6న మాధ్వ నవమి, 8న భీష్మ ఏకాదశి, 12న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి, 24న సర్వ ఏకాదశి, 26న మహ శివరాత్రి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని 62,710 మంది భక్తులు దర్శించుకోగా 15,635 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.14 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం (Sarvadarshan) కలుగుతుందని వివరించారు.