‘ప్రేక్షకులు థియేటర్స్‌కు వెళ్లి ఆనందంగా చూసేందుకు అర్హత ఉన్న మంచి సినిమా చేశాం. ప్రతి ఒక్కరం మనసుపెట్టి కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా ఇది’ అన్నారు కార్తికేయ. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘రాజా విక్రమార్క’ ఆదిరెడ్డి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మించారు. శ్రీ సరిపల్లి దర్శకుడు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక జరిగింది. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ “ఆర్ఎక్స్ 100’ తర్వాత నా కెరీర్లో ఎక్కువ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సినిమా ఇదే. విమర్శలు రావడం సహజం. ‘బాహుబలి’ లాంటి గొప్ప సినిమాపై విమర్శలొచ్చాయి. ఈ సినిమాలో మేము చేసిన తప్పుల్ని సమీక్షల్లో రాశారు. భవిష్యత్తులో అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడతాం. అయితే విమర్శలెప్పుడూ ఇతరుల్ని బాధపెట్టేలా ఉండకూడదు’ అని అన్నారు. స్మోకింగ్ సీన్స్ కూడా లేకుండా చక్కటి క్లీన్ ఎంటర్టైనర్గా సినిమా చేశామని ప్రేక్షకులందరూ ప్రశంసిస్తున్నారని దర్శకుడు శ్రీ సరిపల్లి చెప్పారు. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నదని, మౌత్‌టాక్‌తో రోజురోజుకు వసూళ్లు పెరుగుతున్నాయని సమర్పకుడు ఆదిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ , హర్షవర్ధన్ పాల్గొన్నారు.