వైద్యరంగంలో రకరకాల రుగ్మతలు.. వివిధ చికిత్సా విధానాలు ఉంటాయి. ఒక్కోదానికి ఒక్కో కారణం కూడా ఉంటుంది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు జన్యుపరంగా వస్తాయి. వాటిలో కొన్ని అరుదుగా కనిపిస్తాయి. ‘బ్లూమ్ సిండ్రోమ్’ అలాంటిదే. ఈ అరుదైన జన్యులోపం వల్ల మనుషుల్లో ఎదుగుదల కుంటుపడటం, సన్ సెన్సిటివిటీ (సూర్యరశ్మివల్ల ఇబ్బంది), క్యాన్సర్ వచ్చే అవకాశం తదితర రుగ్మతలు సోకుతాయి.
ఇవన్నీ బీఎల్ఎమ్ జన్యువులోని ఉత్పరివర్తనాల నుంచి తలెత్తుతాయి. లక్షణాలు త్వరగా గుర్తించి, జాగ్రత్తలు తీసుకుంటే జీవితాన్ని సాఫీగా సాగించొచ్చు.