న్యూఢిల్లీ, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): దేశ రాజధాని న్యూఢిల్లీలోని వసంత్‌విహార్‌లో నిర్మిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ భవనం పనులు తుదిదశకు చేరుకున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్ర రోడ్లు,భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ సంస్థకు మంత్రి పలు సూచనలు చేశారు. సీఎం కేసీఆర్ నిర్దేశించిన గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయానికి అవసరమైన ఫర్నిచర్‌ను కూడా మంత్రి పరిశీలించారు. ఆయన వెంట ఆర్కిటెక్ట్ ఆస్కార్, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు ఉన్నారు.