బచ్చన్నపేట, డిసెంబర్ 16 : మామ వాటర్మ్యాన్గా విధులు నిర్వర్తిస్తున్న గ్రామంలో కోడలు సర్పంచ్‌గా గెలుపొందింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం బోనకొల్లూరులో గ్రామానికి చెందిన చిక్కుడు బాలయ్య గ్రామ పంచాయతీలో 35 ఏండ్లుగా వాటర్మ్యాన్గా పనిచేస్తున్నాడు.
స్థానిక ఎన్నికల్లో ఆయన కోడలు చిక్కుడు కల్పనాకృష్ణ సర్పంచ్‌గా గెలుపొందింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో సర్పంచ్‌గా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.