హైదరాబాద్ : ఓ వైపు చర్చలు జరుగుతుండగానే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. రాజీ మంత్రం పటిస్తూనే అమెరికా ఇరాన్‌పై(Iran) కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. కీలకమైన దౌత్య సమయంలో ఇరాన్ ఓడరేవుల దిగ్బంధానాన్ని అమెరికా కొనసాగిస్తున్నది. హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ కార్గో నౌక టౌస్కాను(Tausca) అమెరికా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. తన నావికా దిగ్బంధనంలో భాగంగా గల్ఫ్‌లో ఇరాన్ జెండా ఉన్న ఒక సరుకు రవాణా నౌకను అమెరికా అడ్డగించిందని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
ఆగిపోమ్మని హెచ్చరించిన స్పందించకపోవడంతో ‘టౌస్కా’ నౌకను అమెరికా నౌకాదళం స్వాధీనం చేసుకుందని అమెరికా అధ్యక్షుడు తన ‘ట్రూత్ సోషల్’ లో పేర్కొన్నారు. ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, త్వరలో ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ పేర్కొంది. ఈ పరిణామాలు పాకిస్థాన్‌లో జరిగే రెండో విడుత చర్చలపై ప్రభావం చేపే అవకాశం ఉంది. మరోవైపు అమెరికా చర్యలపై తీవ్రంగా మండిపడిన టెహ్రాన్ హర్మూజ్‌లో ఇతరులు ప్రయాణించడం అసాధ్యమని తెలిపింది. అమెరికా చర్యను దొంగతనంగా అభివర్ణించింది.