మనదేశంలో చాలామంది రైలు ప్రయాణం చేసి ఉంటారు. రైలు ప్రయాణాలు శాశ్వతమైన జ్ఞాపకాలను మిగులుస్తాయి. అయితే, జపాన్, జర్మనీకి వెళ్తే ఇక్కడ తలకిందులుగా ప్రయాణించే రైళ్లు మనల్ని అబ్బురపరుస్తాయి. ఒక ట్రాక్ కింద వేలాడుతూ రైళ్లు రోడ్లు, నదులు, ఇతర నిర్మాణాల మీదుగా కదులుతుంటాయి. ఈ రైల్వే వ్యవస్థ ఎప్పటినుంచో ఉన్నా ‘నౌ దిస్’ న్యూస్ ఆన్లైన్లో షేర్ చేసిన క్లిప్ ఇప్పుడు ఆన్లైన్లో వైరల్‌గా మారింది.
ఈ క్లిప్‌లో జర్మనీలోని వుప్పర్టల్లో తలక్రిందులుగా ఉన్న రైల్వేలను చూయించారు. ఈ వీడియో చూస్తుంటే అచ్చం సైన్స్ ఫిక్షన్ సినిమా నవలల్లో చూయించింది నిజమైనట్లు ఉంటుంది. ఇంజినీర్ యూజెన్ లాంగెన్ తన చక్కెర కర్మాగారంలో వస్తువులను తరలించేందుకు సస్పెన్షన్ రైల్వేతో ప్రయోగాలు చేశారు. 1893లో అతను తన సస్పెన్షన్ రైల్వే వ్యవస్థను నగరానికి అందించాడు. అప్పటినుంచీ నగరంలో ఈ రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ రైళ్లు ప్రతిరోజూ 82,000 మందిని వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నాయి.
This German city’s upside-down train looks like it could transport you straight into a sci-fi novel 😮 pic.twitter.com/0jNq4JOGFj
— NowThis (@nowthisnews) May 22, 2022