న్యూఢిల్లీ: ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్కి క్లినికల్ ట్రీట్మెంట్గా మూలకణ చికిత్సను ఉపయోగించరాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆమోదం పొందిన, పర్యవేక్షణతో కూడిన క్లినికల్ ట్రయల్స్ నిబంధనావళికి సంబంధం లేకుండా ఆటిజంకు మూల కణ చికిత్స చేసేందుకు ప్రయత్నించడం అనైతికం మాత్రమే కాకుండా తగిన జాగ్రత్తలు పాటించకుండా చికిత్స చేయడమవుతుందని స్పష్టం చేసింది.
పరిష్కారాల కోసం నైరాశ్యంతో ఎదురు చూస్తున్న బాధిత కుటుంబాలకు రుజువు కానటువంటి, ప్రయోగాత్మక చికిత్సలను మార్కెటింగ్ చేస్తుండటంపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో కోర్ట్ ఈ తీర్పునిచ్చింది.