ముంబై, మే 13: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. వరుసగా నాలుగు రోజులుగా నష్టాల్లో కదలాడిన సూచీలకు మెటల్, ఎనర్జీ, వినిమయ స్టాక్స్లకు కొనుగోళ్ల మద్దతుతో సూచీలు తిరిగి కోలుకున్నాయి. రూపాయి రికార్డు స్థాయిలో పతనం చెందడం, విదేశీ పెట్టుబడులు తరలిపోయినప్పటికీ తీవ్ర హెచ్చుతగ్గుదల మధ్య కొనసాగిన సూచీలు చివకు లాభాల్లోకి వచ్చాయి.
వెయ్యి పాయింట్లకు పైగా కదలాడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 49.74 పాయింట్లు అందుకొని 74,608.98 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 33.05 పాయింట్లు ఎగబాకి 23,412.60 వద్ద నిలిచింది.