సంజయ్ రావ్, ప్రణవి మానుకొండ జంటగా మైక్ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈ సినిమాతో ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం జరిగింది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. మైక్ మూవీస్ నిర్మిస్తున్న నాలుగో చిత్రమిది. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మాతలు. వినూత్న ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. బ్రహ్మాజీ, ఛమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : వైష్ణవ్ వాసు, సినిమాటోగ్రఫీ : శ్రీనివాస్ జె రెడ్డి, సంగీతం : భీమ్స్ సిసిరోలియో.