ఎస్తేర్ నోరోన్హా, అజయ్ జంటగా దర్శకుడు పి సునీల్‌కుమార్ రెడ్డి రూపొందిస్తున్న సినిమా ‘#69 సంస్కార్ కాలనీ’. లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా పతాకాలపై బి. బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 4న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా హైదరాబాద్‌లో ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘నేటి సమాజంలో బంధాలకు విలువ తగ్గిపోయింది. ఇదే అంశాన్ని దర్శకుడు చిత్రంలో చూపించారు. సినిమా ఆలోచింపజేసేలా ఉంటూ వినోదాన్ని పంచుతుంది’ అని ఎస్తేర్ చెప్పింది. దర్శకుడు పి సునీల్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..‘సామాజిక కోణంలో సినిమా రూపొందించాం. సహజత్వానికి దగ్గరగా చిత్రీకరణ ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాం’ అన్నారు.