నారాయణపేట టౌన్, డిసెంబర్ 9 : జాతీయ రహదారి 167 రోడ్డు విస్తరణతోపాటు భారత్‌మాల భూ సేకరణ ప నులు వేగవంతం చేయాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో భారత్‌మాల, జాతీయ రహదారి 167 పనులపై సంబంధిత అధికారులు, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. భారత్ మాల భూ సేకరణలో భాగంగా సేకరించిన భూమికి సంబంధించి 3డీ ఆన్లైన్ అఫ్లోడ్ విషయంలో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారి అథారిటీ డీజీఎంకేపీ సరస్వతి సమాధానం ఇస్తూ నారాయణపేట జిల్లాలోని 19 గ్రామాల గుండా భారత్‌మాల జాతీయ రహదారికి సేకరించాల్సిన 227 హెక్టార్ల భూ సేకరణ పనులు పూర్తయ్యాయ న్నారు. డీపీఆర్‌కు 3డీ ఆన్లైన్ నోటిఫికేషన్ అఫ్లోడ్ చేసే విషయంలో ఇప్పటివరకు 169 హెక్టార్లు పూర్తి చేసినట్లు చె ప్పారు. మిగతా 5 గ్రామాలకు సంబంధించి శనివారం లో గా పూర్తి చేస్తామని వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 3డీ నోటీస్ అఫ్లోడ్ ప్రక్రియ పూర్తి చేసినట్లయితే సంబంధిత భూమి హక్కు దారులకు అవార్డులు పాస్ చేసి పరిహారం చెల్లించే ప్రక్రియ ప్రారంభమవుతున్నదని పేర్కొన్నారు. జాతీయ రహదారి 167 పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, రోడ్డు విస్తరణతోపాటు హరితహా రం మొక్కలు నాటే బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్‌పై ఉం దన్నారు. జాతీయ రహదారి విస్తరణలో అక్కడక్కడ ఆలయాలు, ప్రార్థన మందిరాలు, విగ్రహాలు అడ్డు వస్తున్న విషయాన్ని జాతీయ రహదారుల డీఈ రమేశ్‌బాబు కలెక్టర్ దృ ష్టికి తీసుకొచ్చారు. స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ ఆ యా ఆలయాలు, ప్రార్థన మందిరాల కమిటీ సభ్యులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆర్డీవో వెంకటేశ్వర్లును ఆ దేశించారు. సమావేశంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, జాతీయ రహదారుల అథారిటీ డీజీఎంకేపీ సరస్వతి, టీమ్ లీడర్ రా జ్‌కుమార్, డీఈ రమేశ్‌బాబు, ల్యాండ్ సర్వేయర్ మూసా, ఏడీ సర్వేయర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.