అరుణాచల్‌లో వేలాది చేపలు మృత్యువాత
ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌లోని కామెంగ్ నదిలో నీరు అకస్మాత్తుగా నలుపు రంగులోకి మారి, వేలాది చేపలు చనిపోయాయి. కాలుష్య కారకాలు భారీస్థాయిలో కలువడంతోనే నీరు రంగు మారిపోయిందని అధికారులు గుర్తించారు. నదిలో కలిసి కరిగే వ్యర్థాల (టీడీఎస్) పరిమాణం సాధారణంగా లీటరుకు 300-1,200 మిల్లీ గ్రాములు ఉండాలి. ఇది కామెంగ్ నదిలో 6,800 మిల్లీ గ్రాములు ఉన్నట్టు తేలింది. నది కాలుష్యానికి పొరుగుదేశం చైనా చేపట్టిన భారీ నిర్మాణాలే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.