కొల్లాపూర్ : జష్నే ఈద్ మిలాద్-ఉన్-నబీ సందర్భంగా శుక్రవారం కొల్లాపూర్ (Kollapur) పట్టణంలో ముస్లింలు ర్యాలీ ( Rally ) నిర్వహించారు. చౌని స్ట్రీట్ మస్జీదే ఖుబా నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు అక్కడ నుంచి పాత బస్టాండ్ జమా మస్జీద్ వరకు ర్యాలీ నిర్వహించారు. దారిపోడవునా హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేశారు. మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజున జరుపుకునే మిలాద్-ఉన్-నబీ అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.
మహమ్మద్ ప్రవక్త బోధించిన ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నేతలు, నయిమ్ , నజీరు బాబా, ఎక్బాల్, రహీం, అహమద్ ఘోరి, ఖాదర్ పాషా,ఆరీఫ్, అన్వార్, ముస్తాక్, ఖాద్రి, ముజీబ్ ఘోరి, ఖాజా, మత పెద్దలు హషీమ్, అయూబ్ ఖాన్, మొయినాద్దీన్ తదితరులు ఉన్నారు.