న్యూఢిల్లీ, మార్చి 29: దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్..తన వాహన కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 5 నుంచి అమలులోకి వచ్చేలా మోటర్‌సైకిల్, స్కూటర్ల ధరలను రూ.2 వేల వరకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు భగ్గుమనడంతోనే ధరలు పెంచాల్సి వచ్చిందని ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆయా మోడళ్ళను బట్టి ధరల పెంపులో వ్యత్యాసం ఉంటుందని తెలిపింది.