Assembly | రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల వేళ తెలంగాణ పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు. మహిళా ఎమ్మెల్యేలు అని కూడా చూడకుండా పోలీసులు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల దుస్తులతో అసెంబ్లీకి హాజరవుతున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నల్ల చీర ధరించి అసెంబ్లీకి బయలుదేరారు. అయితే ఆమెను పోలీసులు జుట్టుపట్టుకొని లాగి దారుణంగా అడ్డుకున్నారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. నొప్పితో విలవిల్లాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో ఎమ్మెల్యే సునితా లక్ష్మారెడ్డి పట్ల కూడా ఇలాగా ప్రర్తించారు. తన చీర లాగి అవమానించా రని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ముందు ఆమె కంటతడి పెట్టుకోవడం కలకలం రేపింది.
అసెంబ్లీ వద్ద సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని అమానుషంగా ప్రవర్తించిన పోలీసులు
మహిళా ఎమ్మెల్యేలని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరిస్తున్న పోలీసులు https://t.co/SvwSMzjwRW pic.twitter.com/vAnjQSehPK
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026