e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 19, 2022
Home News ప్లానింగ్‌.. పంచతంత్రం

ప్లానింగ్‌.. పంచతంత్రం

  • ఐదు భాగాలుగా ప్రణాళికా విభాగం
  • పునర్‌ వ్యవస్థీకరించిన జీహెచ్‌ఎంసీ
  • ఆదేశాలు జారీ చేసిన కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌

సిటీబ్యూరో, డిసెంబర్‌ 2(నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ మహా నగరం రోజు రోజుకూ తన పరిధిని పెంచుకుంటూ పోతుంది. శరవేగంగా విస్తరిస్తున్న మహా నగర జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. హైదరాబాద్‌ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా ఇందుకు అవసరమైన ప్రణాళికలతో ముందుకువెళుతుంది. ఇందులో భాగంగా ప్రధానంగా జీహెచ్‌ఎంసీ ప్లానింగ్‌ విభాగం పునర్‌ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌ కుమార్‌ జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ విభాగాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు టౌన్‌ప్లానింగ్‌లో ఐదు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేసి వాటికి నగర ప్రణాళికాధికారులు, సహాయ ప్రణాళికాధికారులను కేటాయించారు. లోకల్‌ ఏరియా ప్లాన్‌తో పాటు సమగ్ర ప్లానింగ్‌ పథకాలు, బిల్డింగ్‌ రూల్స్‌, రెగ్యులేషన్స్‌ అమలు వంటి అంశాలు చూడనుంది. వీటితో పాటు టీఎస్‌-బీ పాస్‌ అమల్లో భాగంగా సెల్ప్‌ సర్టిఫికేషన్‌తోనే భవన నిర్మాణాలకు అనుమతి ఇవ్వాల్సి ఉండటం, పోస్ట్‌ వెరిఫికేషన్‌ వంటివి అవసరం కావడంతో పాటు టీఎస్‌ బీ-పాస్‌లో పేర్కొన్న అంశాలను సవ్యంగా అమలు చేసేందుకు టౌన్‌ ప్లానింగ్‌ విభాగాన్ని ఆయా సెల్స్‌ ఏర్పాటుతో వికేంద్రీకరిస్తూ పునర్‌ వ్యవస్థీకరించారు. వాటి వివరాలను పరిశీలిస్తే…

ప్లానింగ్‌ పాలసీ విభాగం-శరవేగంగా అభివృద్ధి చెందుతు న్న ప్రాంతాలపై అధ్యయనం చేస్తూ స్థానికంగా తలెత్తబో యే సమస్యలకు ముందుగానే పరిష్కారాలు చూపడం, వాటి అమలులో ప్రత్యేక దృష్టి సారించడం ఈ విభాగం పని చేయనుంది.

- Advertisement -

డెవలప్‌మెంట్‌-అభివృద్ధి, రోడ్ల విస్తరణ, భూ సేకరణ, నా లాల విస్తరణ, లింకు రోడ్ల అభివృద్ధి వంటి కార్యక్రమాలకు ఆటంకాల్లేకుండా ముందుకు తీసుకువెళ్లేందుకు అభివృద్ధి విభాగాలు, అన్ని జోనల్‌ కార్యాలయాల్లో డిప్యూటీ సిటీ ప్లానర్‌ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటయ్యాయి.
స్పెషల్‌ ప్రాజెక్టు సెల్‌-చెరువుల అభివృద్ధి, వారసత్వ కట్టడా లు, భూ సమీకరణ పథకాల అమలును ఈ విభాగం ప్రత్యేకంగా చూడనుంది. ఎస్పీ సెల్‌ను ఏర్పాటు చేశారు.

అర్భన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం-డిజిటల్‌ ఇంటి నంబర్లు, జీఐఎస్‌ మ్యాప్‌ తయారీ వంటి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ప్రత్యేక విభాగం నూతనంగా ఏర్పాటైంది. ఎన్‌ఆర్‌ఎస్‌ఏ నుంచి సేకరించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలతో నగరం మొత్తానికి బేస్‌ మ్యాప్‌ తయారీ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రోడ్లు, భూ వినియోగం, భవనాలు, లే అవుట్లతో సహా 54 అంశాలతో రూపొందిస్తున్నారు.

గ్రేటర్‌కు సంబంధించి ఖాళీ స్థలాలు ఎక్కడెక్కడ? ఎంత మేర ఉన్నాయో తేల్చనుంది. పచ్చదనం, చెరువులు, నాలాలు, ఇతరత్రా భూ వివరాల సమగ్ర సమాచారాన్ని ఈ విభాగం ఎప్పటికప్పుడు అధ్యయనం చేయనుంది.

టీఎస్‌ బీ పాస్‌ – నిర్మాణ అనుమతుల విధానాన్ని సులభతరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్‌ బీ పాస్‌ చట్టం విధి విధానాలు తప్పక అమలయ్యేలా చూసేందుకు కేంద్ర కార్యాలయం, జోనల్‌ కార్యాలయాల్లో ఈ విభాగం ఏర్పాటు చేశారు. ఇంజనీర్లతో పాటు పోలీస్‌, విజిలెన్స్‌ విభాగాలకు చెందిన అధికారుల సభ్యులు, జాయింట్‌ కమిషనర్‌ నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. జోన్‌కు రెండు టీమ్‌లు ఉన్నాయి. 600 చదరపు గజాల కంటే మించిన, 10 మీటర్ల కంటే ఎత్తైన భవనాల అనుమతులు సత్వర జారీకి జీహెచ్‌ఎంసీ జోనల్‌ కార్యాలయాలు, ప్రధాన కార్యాలయాల్లో సింగిల్‌ విండో విధానం అమలవుతుంది. ఇప్పటి వరకు 6,562 మందికి సత్వర నిర్మాణ అనుమతులను ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement