Congress | కాంగ్రెస్ దగా కోరు పాలనపై తెలంగాణ ప్రజలు భగ్గుమంటున్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిలువునా చేసిన మోసంపై ‘ఎగవేతల ఏలికా.. చేసింది చాలిక’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటితో కాంగ్రెస్ అధికారంలోకి 1000 రోజులు అవుతున్న సందర్భంగా ఆరు గ్యారంటీలు, 420 మోసాలపై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. బాకీలపై బరాబర్ అడుగుతున్నారు. అధికారంలోకి రాగానే రైతుల రుణమాఫీని చేస్తామని చెప్పి రైతులకు చేసింది సున్నామాత్రమే. రైతు భరోసా కింద ఏటా ఎకరానికి రూ. 15,000, వ్యవసాయ కూలీలకు రూ. 12,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామన్నారు.
2023 ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతులకు ఎకరానికి ఏటా రూ. 15 వేలు ఇస్తామని చెప్పారు. ప్రతి సీజన్లో టంచనుగా పెట్టుబడిసాయం అందిస్తాం. రైతన్నను కడుపున పెట్టుకొని చూసుకొంటాం అని 15.02.2023లో టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ, 1000 రోజుల కాంగ్రెస్ పాలన ఏం చేశారు? ఎకరానికి సీజన్లో ఇస్తామన్న మొత్తం: రూ. 7,500.. ప్రస్తుతం ఎకరానికి ఇస్తున్న రూ. 6,000 ఇస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం ఇప్పటి వరకు 5 సీజన్లు ఎగ్గొట్టింది. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 28,720 కోట్లు బాకీ పడింది. గెలిచాక చెప్పింది ఏంటి? మీరు చేస్తున్నది ఏంటి? మీ పాలన ఇక చాలు రేవంత్ అని ప్రజలు ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
పూర్తి సమాచారం కోసం కింది ఫొటోను క్లిక్ చేయండి