OG 2 | పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు బర్త్‌డే ట్రీట్.. ‘OG 2’ గ్లింప్స్‌లో అదిరిపోయే ట్విస్ట్!
OG 2 | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘OG 2’ పై అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సుజీత్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ‘OG’ సీక్వెల్‌కు సంబంధించిన చిన్న గ్లింప్స్‌ను విడుదల చేసి సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు.
OG 2 | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘OG 2’ పై అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు సుజీత్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ‘OG’ సీక్వెల్‌కు సంబంధించిన చిన్న గ్లింప్స్‌ను విడుదల చేసి సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశారు. గతేడాది విడుదలైన ‘OG’ పవన్ కళ్యాణ్ అభిమానులకు కావాల్సిన ఫుల్ మాస్ ట్రీట్ ఇచ్చింది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్‌ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో.. దాదాపు అలాంటి పవర్ఫుల్ అవతార్‌లో చూపించారు దర్శకుడు సుజీత్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్టైల్, యాక్షన్, డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్‌లోనే సీక్వెల్‌కు సంబంధించిన హింట్ ఇవ్వడంతో ‘OG 2’పై అప్పటి నుంచే ఆసక్తి మొదలైంది.
ఇప్పుడు విడుదల చేసిన గ్లింప్స్ చూస్తుంటే.. రెండో భాగం మరింత భారీగా, మాస్ యాక్షన్‌తో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ‘OG 2’ కథలో ప్రధానంగా ఓజాస్ గంభీర పాత్ర చుట్టూనే కథ తిరగనున్నట్లు గ్లింప్స్ ద్వారా హింట్ ఇచ్చారు. ముంబై మాఫియా ప్రపంచాన్ని వణికించిన గంభీర కొంతకాలం ముంబైని వదిలి వెళ్లిపోతాడు. అసలు గంభీర ముంబై నుంచి ఎందుకు వెళ్లాడు? ఎక్కడికి వెళ్లాడు? ఆ సమయంలో అతని జీవితంలో ఏం జరిగింది? తిరిగి ముంబైకి ఎందుకు వచ్చాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ‘OG 2’ కథగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది పూర్తిస్థాయి సీక్వెలా? లేక ఫస్ట్ పార్ట్‌లో చూపించని గత కథను చెప్పే ప్రీక్వెల్ తరహా కథనా? అనే విషయంపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ప్రేక్షకులకు తెలియని గంభీరుడి జీవితంలోని మరో కీలక అధ్యాయాన్ని చూపించబోతున్నట్లు మాత్రం గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది.
ఫస్ట్ పార్ట్‌లో పవన్ కళ్యాణ్ ఉపయోగించిన జపనీస్ స్వోర్డ్ ‘కటానా’ ఎంతగా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్ సన్నివేశాలు కూడా అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ‘OG 2’లో అంతకు మించి యాక్షన్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్లింప్స్‌లో కనిపించిన హింట్స్ ప్రకారం.. పవన్ మరింత కొత్త తరహా యుద్ధ విద్యలు, ఆయుధాలతో కనిపించే అవకాశం ఉంది. దీంతో రెండో భాగంలో యాక్షన్ డోస్ భారీగా ఉండబోతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. ‘OG 2’ గ్లింప్స్‌లో కనిపించిన కొన్ని అంశాలు మరో ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. ముఖ్యంగా సుభాష్ చంద్రబోస్, వారియర్ అనే అంశాలకు సంబంధించిన హింట్స్ కనిపించడంతో గంభీరుడి కథకు స్వాతంత్ర్య ఉద్యమం లేదా అప్పటి చారిత్రక నేపథ్యంతో ఏదైనా లింక్ ఉంటుందా? అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం గ్లింప్స్ ఆధారంగా అభిమానులు చేస్తున్న అంచనాలే. సినిమా కథకు సుభాష్ చంద్రబోస్‌కు ఎలాంటి సంబంధం ఉందనే విషయంపై మేకర్స్ అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, దర్శకుడు సుజీత్ కలిసి ‘OG’ సీక్వెల్ కథపై చర్చిస్తున్న వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఇచ్చిన హింట్స్ ద్వారా ‘OG 2’ కథ ఎలా ఉండబోతుందనే దానిపై ఆసక్తి పెరిగింది.
From the #OGUniverse
To the #OG…ALL LOVE for everything so far…
And everything that begins from here 🙂 🧿🧿♥️♥️Happy Birthday @PawanKalyan Sir 🔥 pic.twitter.com/nVCzic6nBk
— Sujeeth (@Sujeethsign) September 2, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

