హైదరాబాద్ : విద్యా నైపుణ్యంలో అగ్రగామిగా, ఆసియాలో అతిపెద్ద విద్యా సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందిన నారాయణ గ్రూప్.. మరో సాహసోపేతమైన చొరవ చూపింది. ‘ది వన్ స్కూల్’ పేరుతో స్కూల్‌ను ప్రారంభించింది. అభ్యాసాన్ని పునర్నిర్వచించడంలో నారాయణ గ్రూప్ చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా ‘ది వన్ స్కూల్’ నిలువనుంది.
దీనిపై డాక్టర్ సింధూర నారాయణ మాట్లాడుతూ.. ‘మనం ఇప్పుడు అధిక మార్కులు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ డిమాండ్ చేసే ప్రపంచంలో జీవిస్తున్నాం. అందుకు లోతైన ఆలోచన, అడాప్టెబిలిటీ అవసరం. ‘ది వన్ స్కూల్’ ఈ అవసరాన్ని తీర్చేదిగా తీర్చిదిద్దబడింది. ఇక్కడ మనం అత్యున్నత ప్రపంచ విద్యా ప్రమాణాలను కల్పిస్తాం. విద్యార్థులు విద్యాపరంగా మాత్రమే కాకుండా బాధ్యతాయుతమైన ప్రపంచ పౌరులుగా సన్నద్ధమవుతారు’ అని చెప్పారు.
‘ది వన్’ మానవీయ విలువలతో కూడిన భావి తరం నాయకులను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయాణం హైదరాబాద్‌లో ప్రారంభమవుతున్నది. కొండాపూర్‌లో 2026-27 విద్యా సంవత్సరానికిగానూ అధికారికంగా ప్రపంచ స్థాయి ‘ది వన్ స్కూల్’ క్యాంపస్ ఏర్పాటైంది. ఈ స్కూల్ ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్ (International Baccalaureate-IB)’ సిలబస్‌ను బోధిస్తుంది.
ఈ క్యాంపస్‌లో వ్యవస్థాపక విద్యార్థుల బృందం కోసం అడ్మిషన్లు జరుగుతున్నాయి. ది వన్ స్కూల్ సాంప్రదాయ పాఠశాల విద్యను కాకుండా సమగ్ర పర్యావరణ వ్యవస్థను అందించడానికి, విద్యాపరంగానే కాకుండా అభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాల్లో రాణించే వ్యక్తులను తీర్చిదిద్దడానికి నెలకొల్పబడింది. ఈ స్కూల్ ‘అన్లాకింగ్ ది వన్ విత్ఇన్’ తత్వశాస్త్ర సూత్రానుసారం స్థాపించబడింది. ది వన్ స్కూల్ సాంప్రదాయ అభ్యాసానికి మించి విద్యను అందిస్తుంది. పిల్లల్లో సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ స్కూల్లో సిలబస్ ‘ఇంటర్నేషనల్ బాకలారియేట్’ స్ఫూర్తితో రూపొందించబడినా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠ్యాంశాల నుంచి ఉత్తమ అభ్యాసాలను దీనిలో చేర్చారు.