The Little Mermaid OTT | ది లయన్ కింగ్ (The Lion King), టార్జాన్ (Tarzan), అల్లాదీన్(Aladdin), మోనా (Moana), ఫ్రోజెన్ (Frozen) వంటి యానిమేషన్ మూవీలంటే మనకు ముందుగా గుర్తొచ్చేది హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ(Walt Disney). డిస్నీలో వచ్చే యానిమేషన్ సినిమాలు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. తాజాగా ఈ సంస్థ నుంచి మరో మూవీ వచ్చింది. 1989లో వచ్చిన ది లిటిల్ మెర్మేడ్ (The Little Mermaid )మూవీ గుర్తుందా.. యానిమేషన్ ఫార్మాట్లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తాజాగా ఇదే సినిమాను ఈ యేడాది లైవ్ మోషన్ క్యాప్చర్ (Live Motion Capture) ఫార్మాట్లో వాల్ట్ డిస్నీస్టూడియోస్ విడుదల చేసింది. మే 26న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ లాక్ చేసుకుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ + హాట్స్టార్ (Disney + Hotstar) వేదికగా ఈ మూవీ సెప్టెంబర్ 06 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు డిస్నీ ప్రకటించింది. వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీని రాబ్ మార్షల్ (Rob Marshal) దర్శకత్వం వహించారు. హాలీ బెయిలీ, మెలిస్సా మెక్కార్తీ, జోనా హౌర్-కింగ్, జేవియర్ బార్డెమ్, డేవిడ్ డిగ్స్, జాకబ్ ట్రెంబ్లే తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
కథలోకి వెళితే.. సముద్ర గర్భంలో ఉండే కింగ్ ట్రిటన్కు ఏరియల్ (యువరాణి) అనే కుమార్తె (జల కన్య) ఉంటుంది. మానవుడైన ఎరిక్ అనే యువరాజుతో ఏరియల్ ప్రేమలో పడుతుంది. ఎలాగైనా ఆ రాజుతో తన జీవితాన్ని పంచుకోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో సముద్రపు మంత్రగత్తే ఉర్సూల్లాని కలిసి సహయం కోరుతుంది. కాగా ఎరిక్ని కలుసుకోవాలని ఏరియల్ చేసిన ప్రయత్నాలు పలిస్తాయా అనేది ఆసక్తికరం.
All the wonder, magic, and FUN of Disney’s #TheLittleMermaid on September 6 in Hindi and English! 🫧🦀🪸🐙🐠🐚 pic.twitter.com/bkv1dD3QGk
— Disney+ Hotstar (@DisneyPlusHS) August 12, 2023