IBPS PO/MT-XVI | బ్యాంకింగ్ రంగంలోని ఖాళీలపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ([BPS) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 6715 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్మెంట్ ట్రెయినీ (MT) పోస్టులను భర్తీ చేయనున్నారు.
పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1900, కెనరా బ్యాంక్లో 1500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1100, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 550, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 504, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో 161 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు
ఈ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కనీస వయస్సు 20 ఏండ్లు, గరిష్ఠ వయస్సు 30 ఏండ్లు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం
ప్రారంభ వేతనం రూ. 48,480 – 85,920 (స్కేల్ ప్రకారం) ఉంటుంది. అదనంగా డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు లభిస్తాయి.
ఎంపిక
ఉద్యోగాలకు అభ్యర్థులను ప్రిలిమినరీ, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్, ఇంట్వర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడానికి జూలై 21 చివరితేదీ. ప్రిలిమ్స్ ఆగస్టు, మెయిన్స్ అక్టోబర్లో నిర్వహిస్తారు. ఇతర వివరాలకు www.ibps.in లో సంప్రదించవచ్చు.