హైదరాబాద్,జూన్ 29:మనం స్నానం చేసే చోట, టాయ్ లెట్ కు వెళ్లే చోట తప్పనిసరిగా క్రిములు ఉంటాయి. మీరెప్పుడై నా ఇతరుల రెస్ట్ రూమ్ లోని టాయ్ లెట్ సీట్ ను ఉపయోగించారా ? దాన్ని టచ్ చేయకుండా ఉండేందుకు ప్రయత్నించారా ? కొంతమంది టాయ్ లెట్ ను ఫ్లష్ చేసేందుకు తమ కాళ్లు లేదా టా య్ లెట్ పేపర్లు ఉపయోగిస్తారు. దాన్ని నేరుగా తాకకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. మీ రెస్ట్ రూమ్ ను క్రిమిరహితం చేసుకోవడం అనేది ఇబ్బందికరంగా ఉండకూడదు. రెస్ట్ రూమ్ ఎంతో పరిశు భ్రంగా ఉండాలి.
ఈ సందర్భంగా సీనియర్ మైక్రోబయోలజిస్ట్ డాక్టర్ అపూర్వ కె శ్రీవాస్తవ మాట్లాడుతూ, ‘‘మానవ వ్య ర్థాలు విస్తృతస్థాయిలో మైక్రోఆర్గానిజమ్స్ ని కలిగిఉంటాయి. స్టాఫీలోకొకుస్, కాంపీలోబాక్టర్, ఎంటరో కు కుస్, ఇషెర్చియా కొలి, సాల్మోనెల్లా, షిగెల్లా, స్ట్రెప్టొకొకుస్, ఎర్సినియా వంటి బాక్టీరియాను, పాపిలోమా వైరస్ లు, రొటా వైరస్, హెపటైటిస్ ఎ, ఇ వైరస్ లను కలిగిఉంటాయి. మన గట్ లోని సూక్ష్మజీవు లు 25 -54 శాతం దాకా మానవ వ్యర్థాలను తయారు చేస్తాయని అధ్యయనంలో వెల్లడైంది. కరోనా వైరస్ ఎలా సంక్రమిస్తుందో ఇంకా నిర్ధారణ కానప్పటికీ, జన్యు పరీక్షలను ఉపయోగించే ఎన్నో అధ్య యనాలు, మలం నమూనాల్లో సార్స్–కోవ్–2 (కొవిడ్-19) వైరస్ ఉన్నట్లుగా గుర్తించాయి’’ అని అన్నారు.
టాయ్ లెట్స్ పరిశుభ్రత ను పరిశీలించడంలో దుర్వాసన, వైరస్ / బాక్టీరియా అనేవి ముఖ్యమైనవి. టాయ్ లెట్ సీట్లు అధిక పరిమాణంలో మౌల్డ్, ఈస్ట్, క్రిములను కలిగిఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి. ఎంతో మంది ప్రజలు తమ టాయ్ లెట్లను సరిగా శుభ్రం చేయడం లేదనే విషయాన్ని ఇది వెల్లడిస్తోంది. అంతేగాకుండా, దుర్వాసన అనేది క్రిములను పూర్తిగా హతమార్చలేదు అనేందుకు కూడా సూచిక. దీర్ఘకాలం నిలిచిఉండే తాజాదానం ఆ తేడాను తెలియజేస్తుంది. మీరు మీ టాయ్ లెట్ ను తరచూ కడిగినా సరే, క్రిములను తొలగించేందుకు అత్యుత్తమ మార్గం దాన్ని క్రిమిరహితం (డిస్ ఇన్ ఫెక్ట్) చేయడమే.
అందుకే మీరు ఎంచుకునే ఉత్పాదన దుర్వాసనను తొలగించే సామర్థ్యం కలిగిఉండాలి, అంతేగాకుండా దీర్ఘ కాలం పాటు సువాసనలు వెదజల్లేలా ఉండాలి. ఫ్రెష్ గార్డ్ సాంకేతికతతో కూడిన, ఉదాహరణకు డొమెక్స్ వంటి శక్తివంతమైన టాయ్ లెట్ క్రిమినాశిని సర్ఫేస్ మాడిఫికేషన్ మాలిక్యుల్స్ ను కలిగి ఉంటుంది. అది ఉపరితలాన్ని హైడ్రోఫోబిక్ లేదా యాంటీ స్టిక్ గా మార్చేస్తుంది. తడి ఆరిపోయే సామర్థ్యాన్ని అ ది సూచిస్తుంది. తద్వారా శుభ్రమైన, దుర్వాసన లేనటువంటి టాయ్ లెట్ ను సుదీర్ఘ కాలం పాటు అందిస్తుంది. సాధారణ టాయ్ లెట్ క్లీనర్ కంటే కూడా మరింత మెరుగైన దాన్ని సాధిం చవచ్చు.
బాత్ రూమ్ లో ఉండే క్రిములు టాయ్ లెట్ లోనే పుట్టి ఉంటాయని, ఆ తరువాత అవి సులభంగా గదిలోని ఇతర ప్రాంతాలకు అంటే, అత్యంత మురికైన ప్రాంతాల్లో రెండోదిగా ఉండే ఫాసెట్ హ్యాండిల్స్ లాంటి చోట్లకు వి స్తరించవచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఫ్లషింగ్ టాయ్ లెట్స్ ఉత్పత్తి చేసే ఏరొసొల్ డ్రాప్ లె ట్స్ అనేవి బాక్టీరియా, వైరస్ లకు నిలయాలుగా ఉంటాయని, అవి బాత్ రూమ్ ఉపరితలాలకు విస్తరిస్తా యని పలు అధ్యయనాల్లో తేలింది. ఆ విధంగా, ఓ వ్యక్తి టాయ్ లెట్ ఉత్పత్తి చేసే ఏరోసొల్ (సూక్ష్మ అణువు) నుంచి ఇన్ఫెక్షన్ పొందే అవకాశం ఉంది.
బాత్ రూమ్ లు, టాయ్ లెట్స్ గనుక సూక్ష్మక్రిములు వృద్ధి చెందేందుకు అనువుగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అవి గనుక సూక్ష్మజీవులకు అనువుగా ఉంటే, బాక్టీరియాను హతమార్చే ద్రావణాలతో తర చూ ఉపరితలాలను శుభ్రం చేయాల్సి ఉంటుంది. టాయ్ లెట్, బాత్ టబ్, సింక్, హ్యాండిల్స్, ఫాసెట్స్ ఉపరితలాలపై మరింత దృష్టి పెట్టాలి. క్లీనింగ్ బాగా చేసేది ఏదో తెలుసుకునేందుకు అటూ ఇటూ పరుగులు తీయాల్సిన అవసరం లేదు. కాస్తంత ప్రశాంతంగా ఉంటూ ప్రాథమిక అంశాలను పరిశీలించాలి. సాధారణంగా ప్రజలు ఉపయోగించే క్లీనింగ్ పదా ర్థాలు ఏంటో చూద్దాం. అదే విధంగా, తేలికగా, క్రిములను ఎదుర్కొనే పరిష్కారం ఏంటో కూడా తెలుసుకుందాం.
టాయ్ లెట్ క్లీనింగ్ లో వెనిగర్ ను ఉపయోగించడం ఎన్నో రకాల పాథోజెన్స్ ను గుర్తించలేనంత స్థాయికి తగ్గిస్తుంది. ఇది మీ టాయ్ లెట్‌ను డియోడొరైజ్ చేయడంలో తోడ్పడుతుంది లేదా టబ్ / గ్లా స్ షవర్ డోర్స్ పై హార్డ్ వాటర్ డిపాజిట్స్ ను తొలగిస్తుంది. బాక్టీరియా, ఫంగస్ వంటి సూక్ష్మజీవు లను హతమార్చడంలో వెనిగర్ ప్రభావపూరితంగా పని చేస్తుంది, అది తేలిగ్గా కూడా లభిస్తుంది. ఉ పరితలాలను శుభ్రం చేయడం వంటి కొన్ని పనులకు కూడా ఇదో చక్కటి ప్రత్యామ్నాయంగా ఉప యోగపడుతుంది. అయితే, దీన్ని ఉపయోగించడంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ఇది ఉపరితలం వన్నెను తగ్గించి, డల్ గా చేస్తుంది.
– చిన్న పాటి మరకలను బ్లీచ్ తో తొలగించవచ్చు. క్రిములను చంపేందుకు, ఫ్లోర్స్ ను తెల్లగా చేసేం దుకు, దుర్వాసనలను తొలగించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. అయితే బ్లీచ్ ఉపయోగించేందుకు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట క్లీనింగ్ ద్రావణం, నీటితో ఉపరితలాన్ని శుభ్రం చేయాలి. ఆ తరువాత దాన్ని క్రిమిరహితం చేసేందుకు బ్లీచ్, నీళ్లతో శుభ్రం చేయాలి. గమనించా ల్సిన అంశం ఏమిటంటే, బ్లీచ్ ఘాటైన వాయువులను వెలువరిస్తుంది. అందుకే బాగా గాలి, వెలుతురు వచ్చే ప్రదేశాల్లోనే దాన్ని ఉపయోగించాలి. లేని పక్షంలో కళ్లు, చర్మానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.
-మీరు గనుక ప్రభావపూరిత టాయ్ లెట్ క్లీనర్ ను ఎంచుకుంటే, అందమైన, రిలాక్సింగ్ బాత్ రూమ్ లోకి అడుగుపెట్టవచ్చు. అందుకే ఉత్పాదనలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఎంచుకోవాలి, ఇంటిని పరిశుభ్రంగా, జీవనశైలికి అనుగుణంగా ఉంచేలా వాటిలో సరైన క్లీనింగ్ పదార్థాలు ఉన్నాయో లేదో చూడాలి.