
మహబూబ్‌నగర్, డిసెంబర్ 11 : దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం రైతులు సాధించిన చారిత్రాత్మక విజయంగా సీపీఎం రా ష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అభివర్ణించారు. శనివారం జిల్లా కేంద్రంలోని రా యల్ ఫంక్షన్హాల్లో సీపీఎం జిల్లా 19వ మహాసభల ప్రారంభోత్సవానికి ఆయ న హాజరై మాట్లాడారు. నూతన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాసే లా ఉన్నాయన్నారు. రైతులు ఈ వాస్తవాన్ని గుర్తించి చట్టాల అమలును ముక్తకంఠంతో ప్రతిఘటించారని తెలిపారు. ఏడాదికాలంగా అనేక అవరోధాలు, అణచివేతలు ఎదుర్కొంటూ రాజీలేని పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ ఫలితంగానే ప్రధాని మోడీ క్షమాపణ చెప్పిన అనంతరం ఈ చట్టాలను రద్దు చేశారన్నారు. రైతులు ఎల్లప్పుడూ ఐ క్యంగా ఉంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. కార్యక్రమం లో సుశ్రుత వైద్యశాల ఎండీ డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ స భ్యులు నర్సింహారెడ్డి, వెంకట్, జిల్లా కార్యదర్శి రాములు, గోపాల్, భూపాల్, వెంకట్రాములు, రాంరెడ్డి, కురుమూర్తి, జబ్బార్, వెంకట్రామిరెడ్డి, ప్రతిభ, పద్మ ఉన్నారు.