మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామం ఆదివారం భక్తజనసంద్రమైంది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఊగిపోయింది. మల్లన్న స్వామి బోనాల జాతర వైభవంగా జరుగగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. సాయంత్రం ఒకేసారి సుమారు 60 వేల మందికి పైగా బోనాలను నెత్తిన ఎత్తుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మల్లన్నకు బోనాలు సమర్పించి పూజలు చేశారు.
మెట్పల్లి రూరల్, మార్చి 20: మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామం ఆదివారం భక్తజనసంద్రమైంది. మల్లన్న స్వామి బోనాల జాతర వైభవంగా జరుగగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయా యి. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామి వారి దర్శనానికి బారులు తీరారు. సాయంత్రం ఒకేసారి సుమారు 60వేల మందికి పైగా బోనాలను నెత్తిన ఎత్తుకొని ఆల యం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేశారు. మల్లన్నకు బోనాలు సమర్పించి పూజలు చేశారు. గొర్రెపిల్లలను, బెల్లాన్ని కానుకగా సమర్పించారు. ఈ సందర్భంగా శివసత్తుల పూనకాలు, పోతురాజులు, డోలు కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బోనాల అనంతరం రథోత్సవాన్ని కనుల పండువగా జరిపారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కోరెపు రవి, జడ్పీటీసీ కాటిపెల్లి రాధాశ్రీ, ఎంపీటీసీ శంకరయ్య, ఉపసర్పంచ్ గంగాధర్, ఆలయ కమిటీ అధ్యక్షుడు దోతుల రమేశ్, నాయకులు కాటిపెల్లి శ్రీనివాస్ రెడ్డి, చేపూరి రాజరెడ్డి, కొమ్ముల రమేశ్, చేపూరి జీవన్‌రెడ్డి, కోరెపు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.