The Game: You Never Play Alone | జెర్సీ భామ శ్రద్ధా శ్రీనాథ్ లీడ్‌రోల్ చేసిన థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ది గేమ్: యూ నెవర్ ప్లే అలోన్’ అనేది ఉపశీర్షిక. రాజేష్ ఎం.సెల్వా దర్శకుడు. నెట్‌ఫ్లిక్స్, అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సిరీస్ అక్టోబర్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా వెబ్ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే శ్రద్ధా శ్రీనాథ్ ఇందులో గేమ్ డెవలపర్‌గా నటిస్తుంది. అనుకొకుండా ఆమెపై అటాక్ జరుగుతుంది. అయితే ఆ అటాక్ చేసిన వాళ్లనూ, వాళ్ల వెనకున్న వాళ్లనూ ట్రాప్ చేసే ఆమె ప్రయాణమే ఈ సిరీస్. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో, స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్‌తో ఆడియన్స్‌కి విభిన్నమైన అనుభూతిని అందించేలా సిరీస్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. నిజం, అబద్ధం మధ్య సన్నని గీత గురించి చెప్పే కథ ఇదని దర్శకుడు రాజేష్ ఎం.సెల్వా అన్నారు. సంతోష్ ప్రతాప్, ఛాందినీ, శ్యామ హరిణి, బాలహాసన్, సుభాష్ సెల్వం, వివియా సంతోష్, ధీరజ్, హెమా ఇందులో ముఖ్య పాత్రధారులు.