OG | పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ థియేటర్లలో గ్రాండ్ రిలీజ్.. ఫ్యాన్ బాయ్ సుజీత్ ఎమోషనల్ నోట్ వైరల్
OG | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ’ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటోంది.
OG | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ’ చిత్రం భారీ అంచనాల నడుమ నేడు థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటోంది. ప్రీమియర్ షోలు, మార్నింగ్ షోల దగ్గర నుంచే థియేటర్లలో హంగామా స్టార్ట్ అయింది. అంచనాలకు తగ్గట్టే సినిమా పవర్ఫుల్ స్టోరీ, స్టైలిష్ స్క్రీన్ ప్లే, బలమైన బీజీఎం, పవన్ స్టైల్ హై మూమెంట్స్‌తో అభిమానులకి ఫుల్ ఫీల్ అందిస్తుంది. డైరెక్టర్ సుజీత్, పవన్ కళ్యాణ్ మాస్ అప్పీల్‌ను కరెక్ట్‌గా క్యాప్చర్ చేస్తూ, ఫ్యాన్స్‌కు ఊహించని కిక్ ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘పవన్ ఈజ్ బ్యాక్’ అంటూ అభిమానులు సంబరాల్లో మునిగిపోతున్నారు.
సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు సుజీత్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో భావోద్వేగంతో కూడిన మెసేజ్ పోస్ట్ చేశారు. “They Call Him OG మీ ముందుకు వచ్చింది. ఎన్నో సంవత్సరాల ప్రయాణం చివరకు పూర్తైంది. ఉత్సాహంతో పాటు కొంత బాధ కూడా ఉంది. ఈ ప్రయాణంలో ప్రతి అడుగులో నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. నా డైరెక్షన్, టెక్నీషియన్ టీంకి ‘ఐ లవ్ యూ’! ఇంకా ఎంత చెప్పినా తక్కువే. నన్ను నమ్మిన మా నిర్మాతలు దానయ్య గారు, కళ్యాణ్ దాసరి గారికి, సినిమాకి తన 100% ఇచ్చిన తమన్ అన్నకి థ్యాంక్స్. సినిమాటోగ్రాఫర్ నవీన్ నూలి బ్రో – నీ మ్యాజిక్ తెరపై ఆడియన్స్ చూసే క్షణాన్ని నేను కూడా ఎదురుచూస్తున్నాను. ఈరోజు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, మ్యాడ్నెస్ ఊహించలేనిది! ఇది కేవలం ఆరంభం మాత్రమే. అన్నీ బాగుంటే ‘OG’ ఇంకా పెద్దదిగా మారుతుంది. లవ్ యూ మై పవర్ స్టార్ ”** అంటూ భావోద్వేగంతో స్పందించారు.
ఓజీ విడుదలతో థియేటర్ల వద్ద ఫ్యాన్స్ ఫెస్టివల్ లా మారింది. బ్యానర్లు, ఫ్లెక్సీలు, డాన్స్‌లు, ఫైర్ వర్క్స్‌తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండుగలా జరుపుకుంటున్నారు. సినిమా కథతో పాటు టేకింగ్, బీజీఎం, యాక్షన్ ఎలిమెంట్స్ కూడా మెప్పించడంతో మాస్-క్లాస్ ఆడియన్స్ రెండింటినీ ఆకట్టుకుంటోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- OG
- Pawan Kalyan
- promotions
- Release
RELATED ARTICLES
తాజా వార్తలు
Asia Cup Rising Stars | భారత్ ఖేల్‌ఖతం.. సెమీస్‌లోనే ఓడిన తిలక్సేన
Gold Price | పసిడి పయనమెటు.. ఈ ఏడాది రూ.55,500 డౌన్.. ఇప్పుడు కొనాలా.. వేచి చూడాలా?
Delimitation Bill | డీలిమిటేషన్‌కు రంగం సిద్ధం.. 30 నుంచి లోక్‌సభ, 2 నుంచి రాజ్యసభ సమావేశాలు
Indiramma Bima | ఇంటి పన్ను కడితేనే ఇందిరమ్మ బీమా.. ములుగు జిల్లా వాజేడులో అధికారుల ఆదేశాలు!
Vivek Venkataswamy | పెద్దపల్లి వివాదంతో నాకేం సంబంధం.. కాంగ్రెస్ ఇన్చార్జి సందీప్‌తో వివేక్
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

