They Call Him OG | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ‘ఓజీ’ (They Call Him OG) నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే బుధవారం జరిగిన ఈ సినిమా ప్రీమియర్‌లో ఉహించని ఘటన చోటు చేసుకుంది. ఈ సినిమా ప్రీమియర్ చూస్తూ.. అభిమానుల అత్యుత్సాహం అదుపు తప్పింది. థియేటర్లో వీరంగం సృష్టించిన అభిమానులు ఏకంగా స్క్రీన్‌ను ధ్వంసం చేశారు. బెంగళూరులోని కే.ఆర్. పురం (K.R. Puram) ప్రాంతంలో ఉన్న థియేటర్లో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం.
ఓజీ సినిమా ప్రీమియర్ ప్రారంభమైన తర్వాత అభిమానులు తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు రెచ్చిపోయి తెరముందుకి వెళ్లి కత్తితో థియేటర్ స్క్రీన్‌ను చింపివేశారు. దీంతో స్క్రీన్‌పై పెద్ద పగుల్లు రాగా.. ఇది చూసిన యాజమాన్యం తక్షణమే షోను రద్దు చేసింది. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే షో రద్దు కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సాధారణంగా పెద్ద హీరోల సినిమా విడుదలైనప్పుడు అభిమానులు తమ ఆనందాన్ని పంచుకోవడం సహజమే అయినప్పటికీ ఆస్తి నష్టం కలిగించడం, తోటి ప్రేక్షకులకు ఇబ్బంది కలిగించడం సరికాదని, ఇలాంటి ఘటనల వల్ల చిత్ర పరిశ్రమకు ప్రేక్షకులకు తీవ్ర నష్టం కలుగుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
‘OG’ సినిమా ప్రీమియర్స్ చూసేందుకు వచ్చి కత్తితో స్క్రీన్ చింపేసిన అభిమానులు
బెంగళూరులోని KR పురంలో ఘటన
దీంతో షో నిలిపివేసిన యాజమాన్యం pic.twitter.com/sLyepIeVdl
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2025