రాంచీ: మహిళల హాకీ ఇండియా లీగ్ రెండో ఎడిషన్‌ను ఢిల్లీ ఎస్జీ పైపర్స్ జట్టు సొంతం చేసుకుంది. రాంచీలో శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఎస్జీ.. 3-2 (షూటౌట్)తో శ్రాచి బెంగాల్ టైగర్స్‌పై విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది. నిర్ణీత సమయంలో 1-1తో స్కోర్లు సమమైనప్పటికీ షూటౌట్ ద్వారా తేలిన ఫలితంలో ఎస్జీ పైపర్స్ అదరగొట్టింది.
విజేతలకు రూ. 1.5 కోట్ల క్యాష్‌ప్రైజ్ దక్కగా రన్నరప్‌నకు కోటి రూపాయలు, మూడో స్థానంలో నిలిచిన రాంచీకి రూ. 50 లక్షల నగదు బహుమానం దక్కింది.