సంగెం, ఏప్రిల్ 30: పది నిమిషాల వ్యవధిలోనే దంపతులు మృతిచెందిన విషాద ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం నార్లవాయిలో శనివారం చోటుచేసుకున్నది. అనారోగ్యంతో భర్త మరణించగా, తట్టుకోలేక భార్య గుండె ఆగిపోయింది. నార్లవాయి గ్రామానికి చెందిన బూర కట్టయ్య (75) ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. దవాఖానకు వెళ్లి మందు లు వాడుతున్నాడు. పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతిచెందాడు. భర్త చనిపోయిన బాధలో ఉన్న భార్య కమలమ్మ (65) గుండెపోటు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలింది. నిమిషాల వ్యవధిలోనే దంపతులు చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.