Painting | న్యూఢిల్లీ: వాడి పారేసిన వస్తువులను కొనే జంక్ డీలర్‌కు దొరికిన పెయింటింగ్ ఆయన కుటుంబానికి అదృష్టం తీసుకొచ్చింది. ఇటలీలోని జంక్ డీలర్ రోస్సో 1962లో కాప్రిలో ఉన్న ఓ ఇంటిని శుభ్రం చేస్తుండగా ఓ పెయింటింగ్ దొరికింది. దాని మీద పాబ్లో పికాసో సంతకం కూడా ఉంది.
దానిని ఆయన పొంపెయిలోని తన ఇంటికి తీసుకెళ్లి, గోడకు తగిలించాడు. దీని గురించి అధ్యయనం చేయగా ఇది పికాసో గీసిన చిత్రమని జంక్ డీలర్ కుమారుడు ఆండ్రియో గుర్తించాడు. అయితే ఈ పెయింటింగ్ పికాసో చిత్రీకరించినదేనని పికాసో ఆథెంటికేటర్స్ ఇంకా నిర్ధారించలేదు. నిర్ధారిస్తే దీని విలువ రూ. 54.58 కోట్లు ఉంటుంది.