ఆదిలాబాద్ : జన హృదయనేత.. తెలంగాణ అభివృద్ధి ప్రదాత సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా జిల్లాలోని ముక్రా(కే) గ్రామానికి చెందిన ఓ కుటుంబం తమ చిన్నారి బాబుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
గ్రామానికి చెందిన వాగ్మారే చంద్రకాంత్, భాగ్యశ్రీ దంపతులకు ఇటీవల కొడుకు పుట్టాడు.
గురువారం నామకరణంలో భాగంగా బాబుకు కేసీఆర్‌గా పేరు పెట్టారు. గిఫ్ట్స్ ఏ స్మేల్ లో భాగంగా సర్పంచ్ మీనాక్షి ఇందుకు అవసరమైన వస్తువులను అందజేశారు.
ముఖ్యమంత్రి పుట్టినరోజు పురస్కరించుకొని గ్రామస్తులు హోమం నిర్వహించడంతో పాటు పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.